పోలీసులు అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడ?

0
97

సీఎం కేసీఆర్ పుట్టినరోజుతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ పుట్టినరోజును క్యాష్ చేసుకోవాలని చూసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్యంగా నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ తాను సైతం ధర్నాకు దిగాలని భావించారు. అంతేకాదు ఉసరవెల్లికి హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. దీనితో ఓ వైపు టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు, మరోవైపు కాంగ్రేస్ నాయకుల అరెస్టులతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉదయం నుంచి కాపు కాసిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అనంతరం నగరమంతా రేవంత్ రెడ్డిని పోలీసులు చక్కర్లు కొట్టించి ఏ పోలీస్ స్టేషన్లో ఉంచకుండా చివరకు గోల్కొండ పీఏస్ లో ఉంచారు పోలీసులు. అలాగే గోల్కొండ పీఏస్ వెళ్ళే దారులన్నీ మూసివేసి పీఏస్ కు కిలోమీటర్ దూరం నుంచి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకొని గోల్కొండ పీఏస్ కు వచ్చే కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తూ టిపిసిసి అధికార ప్రతినిధి మానవతారాయ్ గాంధీభవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాన్ని కూడా జరగకుండా బేగం బజార్ పోలీసులు మానవతారాయ్ ను అరెస్ట్ చేశారు.  మానవతారాయ్ తో పాటు కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్టేషన్ కి పోలీసులు తరలించారు.