క్రిస్మస్ పండగ వచ్చింది అంటే శాంతాక్లాజ్ పేరు వినిపిస్తుంది, పిల్లలకు గిఫ్టులతో కుకీస్ చాక్లెట్లతో శాంతాక్లాజ్ అందరిని సంతోషించేలా చేస్తాడు, అందుకే ఆయనలా అనేక మంది వివిద రూపాల్లో వచ్చి స్పెషల్ గిఫ్టులు ఇస్తారు.
శాంతాక్లాజ్ కూడా తన జీవిత కాలంలో చాలా మంది పిల్లల సంతోషం కోసం తన జీవితంలో సంపాదించిన ఆస్ధి సంపాదన వారికే ఖర్చు చేశాడు.
మరి ఆయన సమాధి గురించి చరిత్ర కారులు ఓ విషయాన్ని తెలిపారు. టర్కీలోని ఒక పాతబడిన చర్చి సముదాయంలో క్రిస్మస్ తాతగా శాంతా క్లాజ్గా పిలవబడే సెయింట్ నికోలస్ సమాధి లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. టర్కీలోని దక్షిణ అంటల్యా ప్రాంతంలోని డెమ్రె జిల్లాలో ఓ పాత చర్చి ఉంది అక్కడ శాంతాక్లాజ్ పుట్టాడు అని నమ్ముతారు.
దాదాపు 1674 సంవత్సరాల సమాధిని నిజంగానే బయటపెట్టడం సాధ్యమా ఈ అనుమానాలు వస్తున్నాయి,
క్రీ.శ 343 సంవత్సరంలో ఇదే చర్చిలో నికోలస్ భౌతికకాయం ఖననం చేయబడిందని చరిత్ర కారులు చెబుతున్నారు.