తెల్లరేషన్ కార్డుదారులకి జగన్ సర్కార్ తీపికబురు

తెల్లరేషన్ కార్డుదారులకి జగన్ సర్కార్ తీపికబురు

0
94

వైట్ రేషన్ కార్డ్ ఉంటే అన్నీ సంక్షేమ పథకాలకు తాము అర్హులము అని భావిస్తారు అందరూ, అందుకే తెల్లరేషన్ కార్డులు కావాలి అని కోరుకుంటారు, అయితే పేదలను గుర్తించి వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నారు అధికారులు, తాజాగా ఏపీలో ప్రతీ పథకానికి ఓ కార్డ్ కూడా ఇస్తున్నారు, పించన్లు రేషన్ ఆరోగ్య శ్రీ ఇలా అన్నీ కార్డులు విడివిడిగా ఇస్తున్నారు.

తాజాగా వైట్ రేషన్ కార్డ్ దారులకి గుడ్ న్యూస్ ..ఏపీలో రెవెన్యూశాఖ మంత్రిగా.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఆయన తొలి సంతకం చేశారు. ఇక బియ్యం కార్డు కనుక మీకు ఉంటే.

ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. బియ్యం కార్డునే ఇన్కమ్ సర్టిఫికేట్ గా గుర్తించనున్నట్టు వెల్లడించారు. ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుందంటున్నారు ప్రజలు.