లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం కూడా తెల్ల రేషన్ కార్డు దారులకు పేదలకు వలస కూలీలకు సాయం అందించింది, ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చడానికి బీజేపీ సర్కారు పలు పథకాలు అమలు చేసింది, బ్యాంకు ఖాతాలో 500 నగదు నెల నెల జమ చేస్తున్నారు.
ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన కింద రేషన్ కార్డు దారులకు ఉచిత రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ ను మరో మూడు నెలల పాటు పొడిగించే యోచనలో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వన్ తెలిపారు. మరో మూడు నెలలు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద రేషన్ అందజేయాలని పది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన తెలిపారు.
ఇక ఇంకా ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఈ సమయంలో మరో మూడు నెలల పాటు ఇది అందివ్వాలి అని కోరుతున్నాయి..అస్సాం, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, రాజస్తాన్ వంటి పలు రాష్ట్రాలు లేఖ రాశాయని వివరించారు. ఇక దేశవ్యాప్తంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్రం మొత్తం 81 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ ను అందజేస్తోంది.