Breaking News- తెలుగు రాష్ట్రాల‌ హైకోర్టులకు కొత్త సీజేలు

Who are the new CJs of Telugu states ..

0
110

రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు. తెలంగాణకు నూతన సీజేగా సతీష్ చంద్రశర్మ, ఏపీకి నూతన సీజేగా ప్రశాంత్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఎనిమిది హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 21న కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం 8 హైకోర్టులకు నూతన సీజేల పదోన్నతితో పాటు, ఐదు హైకోర్టుల సీజేలు, 17 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసులు చేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ కర్ణాటక హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు జస్టిస్ రంజిత్ వీ మోరెను మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్‌ను గుజరాత్ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది.