కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేసులో ఎవరెవరు ఉన్నారో తెలుసా..

0
101
Hath se Hath Jodo

కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు ఖరారు చేయడం ఆ పార్టీకి కష్టంగా మారుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసక్తి కనబర్చట్లేదు. రాహుల్‌ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేరు. సోనియా గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్‌ నాయకుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నియమించాలని కొందరు సీనియర్లు అంటున్నారు.

కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబరు 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో పాదయాత్ర (3500 కిలోమీటర్లు) ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు సెప్టెంబరు 20లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నుకోనున్నారు.

ఇలాంటి తరుణంలో గాంధీ కుటుంబం కాకుండా ఇతరుల పేర్లు కూడా వెలుగులోకి రావడం గమనార్హం.  తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్, సుశీల్ కుమార్ షిండే, డీకే శివకుమార్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారథి ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.