దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోవడం, అలాగే AICC పీఠంపై రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోవడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా గురువారం ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వగా అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించి అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు.
అయితే అధ్యక్ష రేసులో ముఖ్యంగా ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కాగా మరొకరు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్. ఒకవేళ రాహుల్ గాంధీ చివరి వరకు సుముఖంగా లేకపోతే నేను పోటీ చేస్తానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరి రాహుల్ గాంధీ నిజంగానే ఈ ఎన్నికకు దూరంగా ఉంటారా? లేక మనసు మార్చుకొని అధ్యక్ష పీఠం దక్కించుకుంటారో చూడాలి మరి.