తిరుపతి ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి, ఇక పార్టీల తరపున అభ్యర్దుల పేర్లు ప్రకటిస్తున్నారు, తాజాగా వైసీపీ అభ్యర్దిని ప్రకటించింది, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్.ఎం.గురుమూర్తి పేరును ఖరారు చేసింది. మరి ఇంతకీ జగన్ కు ఎంతో నమ్మకంగా ఉన్న ఈయన ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
డాక్టర్ గురుమూర్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని యెర్పెడు మండల మన్నసముద్రం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.చిన్నతనం నుంచి బాగా చదువుకునేవారు ఆయన…గురుమూర్తి బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ అండ్ సర్టిఫైడ్ మాన్యువల్ థెరపీ పూర్తి చేశారు. ఆయన నవ్య కిరణ్ను వివాహం చేసుకున్నారు, వీరికి ఓ బాబు ఓ పాప ఉన్నారు.
SVIMIS యూనివర్శిటీలో ఫిజియోథెరపీ చదువుతున్నప్పుడు 2006 నుంచి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్నారు గురుమూర్తి, అంతేకాదు ఆయన చదువులో కూడా నెంబర్ వన్ .. ఆయన ఫిజియోథెరపీ SVIMS యూనివర్శిటీ ప్రవేశ పరీక్షలో 56వ ర్యాంకు సాధించారు. అంతేకాదు ఎపి స్టేట్ ఫిజియోథెరపీ కౌన్సిల్ స్థాపించడానికి రాజశేఖర్ రెడ్డితో అనేక సార్లు కలిశారు.
అలా వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన బాగా దగ్గర అయ్యారు, అక్కడ నుంచి ఆయనకు అనుచరుడుగా మారారు, తర్వాత జగన్ కు బాగా దగ్గరగా ఎన్నికల నుంచి ఉన్నారు. …2014 ఎన్నికల ప్రచారానికి టీమ్ సభ్యునిగా బాధ్యతను స్వీకరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సమయంలో మొత్తానికి ఫిజియోథెరపిస్ట్గా ఆయన పనిచేశారు, తాజాగా సీఎం జగన్ ఆయన పేరుని ఖరారు చేశారు. ఇక ఆయనకు చాలా సౌమ్యుడు అనే పేరు ఉంది.
|
|
|
తిరుపతి వైసీపీ అభ్యర్ది డాక్టర్ గురుమూర్తి ఎవరంటే – ఆయన రియల్ స్టోరీ
-