వీరప్పన్ ఈ పేరు చెప్పగానే అతను గంధపు చెక్కల స్మగ్లర్ అనే పేరు వినిపిస్తుంది, అంతేకాదు ఏపీ తమిళనాడు కేరళ కర్ణాటక పోలీసులని ముప్పు తిప్పలు పెట్టాడు, గంధపు చెక్కల స్మగ్లర్ గా దేశంలో ఎంతో మందిని హత్య చేశాడు.
జనవరి 18, 1952 న పుట్టాడు వీరప్పన్.. చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్.
అతనిని పట్టుకోవడానికి తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కుకూన్ పేరుతో ప్రణాళికను రచించింది. 1991లో ఆరంభమైన ఈ ఆపరేషన్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్ మరణించే వరకూ కొనసాగింది.
దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా నిలిచింది.
వీరప్పన్ కూతురి పేరు విద్యారాణి ఈ పేరు పెట్టింది పోలీస్ ఆఫీసర్. అవును ..ముత్తు లక్ష్మి కడుపుతో ఉన్నప్పుడు పోలీసులకు లొంగిపోయింది ఆ సమయంలో ముత్తులక్ష్మీకి కూతురు పుట్టింది అక్కడి పోలీస్ ఆఫీసర్ ఆమెకు విద్యారాణి అనే పేరు పెట్టారు, ఆమెకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రిని చూసింది, ఆ సమయంలో డాక్టర్ అవ్వాలి అని తండ్రి ఆమెకి చెప్పాడు, కాని ఆమె లా చదివింది.
2011లో తనకు నచ్చిన వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోంది.