మేయర్ గా ఎవరు ఉన్నా వారికి ప్రత్యేక గుర్తింపు స్ధానం ఉంటుంది, ఇక కార్పొరేషన్లలో మేయర్ కు ఎంతో విలువ ఉంటుంది, మరి తాజాగా హైదరాబాద్ మేయర్ ఎన్నిక జరిగింది.. అయితే మేయర్లు ధరించే గౌను గురించి చాలా మందికి తెలియదు, దేశంలో ఎక్కడ అయినా ఇదే ధరిస్తారు.
హైదరాబాద్ నగర మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. ఇక తాజాగా ఈ గౌను ఎక్కడ తయారు చేస్తారు అంటే దీనిని హైదరాబాద్ లో తయారు చేస్తారు….టైలర్ ప్రవీణ్ కుమార్ బాహెతి దీనిని తయారు చేస్తున్నారు.
ఆయన కోఠీ బడీచౌడీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే వీరి కుటుంబం ఎప్పటి నుంచో ఈ వృత్తి చేస్తున్నారు.
1935 లో ఈయన తాత బన్సీలాల్ నారాయన దాస్ టైలర్ షాప్ స్థాపించారు. ఇక అక్కడ నుంచి ఆయన కుమారుడు అంటే ప్రవీణ్ కుమార్ తండ్రి, తర్వాత ప్రవీణ్ కుమార్ ఈ వర్క్ చేస్తున్నారు…1999 లీజ్ జుల్ఫికర్ ఆలీ మేయర్ అయిననాటి నుంచి ప్రత్యేక గౌన్లను కుట్టడం ప్రారంభించారు. ఇక ఇప్పటి వరకూ తీగల కృష్ణారెడ్డి, బండా కార్తీక, మాజీద్ హుస్సేన్, బొంతు రామ్మోహన్ లకు గౌన్లను కుట్టారు. ఇక చాలా నాణ్యమైన లేస్ దీనికోసం వాడతారట, సుమారు 10 నుంచి 60 వేల వరకూ వీటి ధర ఉంటుంది… న్యాయమూర్తులు, అడ్వకేట్స్ జనరల్స్, అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ లకు, నల్సార్ కాన్వకేషన్ ఇలా ప్రత్యేక గౌన్లు కుడతారట.