దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం అయింది, ఇక ఏపీలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభించారు సీఎం జగన్. ఇక తొలి వ్యాక్సిన్ పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి వేశారు.
ఇక ఆమె స్వచ్చందంగా వచ్చి వాక్సిన్ వేయించుకున్నారు.
ఏపీలో మొత్తం 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు.ఇక కేంద్రం నుంచి వచ్చిన మొత్తం డోసులు చూస్తే 4.96 లక్షలు అని తెలిపారు, ఇక వాటిలో 20,000 డోసులు భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ కి చెందినవి.
ఇక మిగిలినవి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో తయారైన కొవిషీల్డ్ కు చెందినవి. ఇక కచ్చితంగా గుర్తింపు కార్డు చూపిస్తేనే వారికి కేంద్రానికి అనుమతి ఇస్తారు, ఇక వాక్సిన్ వేసిన వెంటనే వారిని అరగంట అబ్జర్వేషన్లో ఉంచుతారు, ఇక అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స ఇస్తారు, ఇక అన్నీ స్టేట్స్ లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.