అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు జో బైడెన్, 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు… అయితే ఈ వేడుకకు ప్రతీసారి లక్షలాది మంది వస్తారు కేపిటల్ హిల్ భవనానికి ..కాని ఈసార వెయ్యి మందిని మాత్రమే పిలిచారు.
కేపిటల్ హిల్ భవన మెట్లపై ఏర్పాటు చేసిన వేదికపై అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రమాణస్వీకారం చేశారు. వీరితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనేది చూద్దాం.. ముందు వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరితో ప్రమాణం సుప్రీంకోర్టు జస్టిస్ చేయిస్తారు.
తర్వాత అధ్యక్షుడు ప్రమాణం చేస్తారు. అధ్యక్షుడ్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తారు, ఆ తర్వాత
ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చేత 127 ఏళ్ల ఫ్యామిలీ బైబిల్పై ప్రమాణం చేయిస్తారు.ఇక ఏనాటి నుంచో ఇదే తేదిన అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం జరుగుతోంది.
1937 నుంచి జనవరి 20వ తేదీనే అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. మొదటిసారి ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ జవనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు, ఆ ఏడాది నుంచి ఇదే డేట్ ని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.