బద్వేల్ బైపోల్ లో గెలుపెవరిదో?

Who won the Badwell Bipole?

0
83

ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినాషన్ దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుదిగడువు. నామినేషన్ల ఉప సంవసంహరణకు అక్టోబర్ 13 చివరి తేదీ. ఇక ఎన్నికలు అక్టోబర్ 30న నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా బద్వేల్ బైపోల్ కోసం 30 రోజులు శివసేన పార్టీ సింబల్ వాడుకుంటా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ధవ్ థాక్రేను అడిగారట. దానికి ఆయన ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వేరే రాష్ట్రం పార్టీ గుర్తులను ఇలా కూడా వాడుకోవచ్చా అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

గతంలో 1999 వరకు బద్వేల్ టిడిపి కంచుకోట అనొచ్చు. టిడిపి నేత మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి & కాంగ్రెస్ నేత ఇటీవల సన్యాసం స్వీకరించిన శివరామ కృష్ణా రావు (బ్రాహ్మణ) మధ్య గట్టి పోటీ ఉండేది. ఒక్కసారి మినహా బిజివేముల వీరారెడ్డి హవా సాగింది. 2000 సం.లో వీరారెడ్డి మరణం తర్వాత 2004 ముందు శివరామ కృష్ణారావు టిడిపిలో చేరటం మళ్ళీ తిరిగి రావటంతో పట్టు తగ్గింది. వైఎస్ హస్తగతంతో గోవిందరెడ్డి ఆధిపత్యం షురూ అయింది. 2009 లో ఎస్సీ రిజర్వుడు.‌ బద్వేలు నియోజకవర్గం రిజర్వుడు అయిననూ కాంగ్రెస్ వైకాపా గోవిందరెడ్డి & తెదేపా విజయమ్మ d/o వీరారెడ్డి మధ్య పోటీ అనుకోవచ్చు. ఆధిపత్యం మాత్రం వైకాపా గోవిందరెడ్డిదే.

2004 నుంచి వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు గెలుస్తూ వచ్చారు. 2014 మినహా గెలుపు అంతరం పెరుగుతూ వచ్చింది. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో వీరారెడ్డి మనవడు కాస్త గట్టిగా పోరాడారు ఫలితంగా పోరుమామిళ్ళ నర్సాపురం గోపవరం మండలాల్లో తెదేపా గెలుపు జెండా ఎగరేసింది. అయితే ఈ ప్రభావం ఏ మేరకు ఉప ఎన్నికల్లో ప్రభావం అనేది చూడాలి. ఇటీవలి సాధారణ ఎన్నికల్లో 45 వేల మెజారిటీ రాగా.. టిడిపి గెలుపుకు అవకాశం లేదు. జనసేన ప్రభావం మహా అయితే పదివేల ఓట్లు. వైకాపా గెలుపుకు ఢోకా లేదు కానీ మెజారిటీపై మాత్రమే అంచనా వేసుకోవాలని రాజకియ విశ్లేషకులు అంటున్నారు.