ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్లుగా మకాం వేసిన తమ బలగాలను అమెరికా ఇప్పుడు వెనక్కి పిలుస్తోంది. దీంతో ఆ దేశంపై పూర్తిగా పట్టుసాధించడంపై తాలిబన్లు దృష్టి పెట్టారు. 2001లో అమెరికా నేతృత్వంలోని దళాలు ఆఫ్ఘనిస్తాన్ పై దండెత్తాయి. దీనికి కారణం
వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో దాడి జరగడం. దీంతో అమెరికా కోపంతో రగిలిపోయింది.
3 వేల మందికి పైగా అమెరికా పౌరులు చనిపోయారు.
దీంతో లాడెన్ను పట్టుకోవడానికి అమెరికా గట్టి ఏర్పాట్లు చేసింది.ఆఫ్ఘనిస్తాన్ లో ఆ సమయంలో అధికారంలో ఉన్న తాలిబన్లు లాడెన్ కు సపోర్ట్ గా ఉన్నారు. దీంతో తాలిబన్ల ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా అమెరికా ప్రణాళికలు రచించింది. తర్వాత అఫ్గాన్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. తాలిబన్లు, సంకీర్ణ దళాల మధ్య సుదీర్ఘ పోరు కొనసాగింది. ఇక తర్వాత లాడెన్ ను చంపేసింది.
ఇక తర్వాత తాలిబన్లపై పోరును అమెరికా ఆపేసింది. దీంతో ఇక అమెరికా బలగాలు ఇక్కడెందుకు అని గత అధ్యక్షుడు ట్రంప్ అక్కడ నుంచి బలగాలను వెనక్కి పిలిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బైడెన్ కూడా అదే వేగవంతం చేస్తున్నారు. ఈ 20 ఏళ్లుగా తాలిబన్లు పాకిస్థాన్ సరిహద్ధుల్లోని పర్వత ప్రాంతాలకు వెళ్లి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారి రాకతో అక్కడ ఆందోళన మొదలైంది.