పావ్భాజీ మన దేశంలో మంచి ఫేమస్ ఫుడ్… స్ట్రీలో కూడా చాలా మంది ఇవి అమ్ముతూ ఉంటారు, ముఖ్యంగా ముంబై పూణే ఇలా మార్కెట్లకు వెళితే అక్కడ ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, దేశంలో ఫేమస్ ఫుడ్ ఐటెమ్ ఇది. మరి ఈ పావ్ భాజీ ఎలా ఫేమస్ అనేది చూస్తే.
1860ల్లోఅమెరికా వ్యాప్తంగా పత్తి సరఫరా లేక ఇబ్బంది పడ్డారు అక్కడ వ్యాపారులు… ఈ సమయంలో పత్తి మిల్లులు ముంబైలో ఎక్కువ ఉన్నాయి, వారు బల్క్ ఆర్డర్ ఇక్కడ ఇచ్చారు, ఇక ఈ సమయంలో ఇక్కడ కార్మికులు 24 గంటలు షిఫ్టులుగా పనిచేసేవారు… ఇక రాత్రి పూట వారికి తినడానికి ఏమీ ఉండేది కాదు.. ఈ సమయంలో కార్మికుల కోసం చిరుతిండ్లు విక్రయించే వ్యాపారులు ఓ ఆలోచన చేశారు… మార్కెట్లో రాత్రి అమ్మగా మిగిలిన కూరగాయలు తీసుకువచ్చేవారు.
వాటితో ఆల్ మిక్స్ కర్రీ చేసేవారు… వెన్నలో వేడిగా బ్రెడ్ వేయించి ఈ కర్రీ ఇచ్చేవారు… ఇక చాలా మంది కార్మికులు దీనికి అలవాటు పడ్డారు… ఇక బాక్సుల్లో అన్నం మానేసి ఇవే తినేవారు తర్వాత రోజుల్లో జనం….ముంబయి మొత్తం ఈ పావ్భాజీ విస్తరించింది. దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇలా పరిచయం అయింది. అయితే మరి పేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా, సింపుల్ భాజీ అంటే మరాఠీలో కూరగాయలు బ్రెడ్ను పావ్ అని పిలుస్తారు. సో ఇది దీని వెనుక ఉన్న కథ.