ఉత్తరాఖండ్లోని నందాదేవి జాతీయ పార్కు దగ్గర కొండల్లో ఉన్న గ్లేసియర్ ఒక్కసారిగా విరిగిపోయింది, దారుణమైన విషాదం మిగిల్చింది.. దీంతో ఒక్కసారిగా చమోలీ జిల్లాలో ఉన్న నదుల్లో వరద నీరు పోటెత్తింది. ఈ వరదకి ఏకంగా అక్కడ
రిషిగంగా పవర్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. అయితే ఇంకా ఈ కూలిన ప్రాంతం గుర్తించాల్సి ఉంది, ఇక ఎందుకు ఆ గ్లేసియర్ విరిగిపోయింది అనేదానిపై విచారణ చేస్తున్నారు.
నిపుణులు చెప్పేదాని ప్రకారం గ్లేసియర్లపై ఉన్న భారీ మంచుఫలకాలు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అకస్మాత్తుగా కరిగి ఉంటాయని, అందుకే ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటుంది అని భావిస్తున్నారు ప్రాధమికంగా ..గ్లేసియర్లు విరిగిపడడం వల్ల అక్కడ ఉన్న రాళ్లు మట్టిచరియలు కూడా నదీ లోయల్లో అకస్మాత్తుగా కొట్టుకువస్తాయి. ఇలా నీటి ప్రవాహం పెరుగుతుంది చిన్న చిన్న సరస్సుల్లా కూడా ఏర్పడుతున్నాయి చాలా చోట్ల అంటున్నారు నిపుణులు.
కొండచరియలు లోయలో ఉన్న హిమ సరస్సులో పడి ఉంటాయని ఇది కూడా ఇంత భారీ వరద రావడానికి కారణం అయి ఉండవచ్చు అంటున్నారు…భౌగోళికంగా సున్నితమైన ప్రదేశాల్లో ఉన్న పవర్ ప్రాజెక్టుల విషయంలో ఆలోచన చేయాలి అని చెబుతున్నారు నిపుణులు.