అనుమానంతో భార్య రెండు చేతులు నరికేసిన భర్త

అనుమానంతో భార్య రెండు చేతులు నరికేసిన భర్త

0
79

మనిషికి ఏ జబ్బుఉన్నా దానికి విరుగుడుకి మందు ఉంది కానీ అనుమానం అనే జబ్బుకు ఇంతవరకు మందు తయారు చేయలేదు… అందుకే అంటారు అనుమానం ప్రాణాంతకరమైన జబ్బుకన్నా ప్రమాదం అని… తాజాగా ఒక వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకుని రెండు చేతులు నరికేశాడు..

తాజాగా ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది… రైల్వే కోడూరు వీపీఆర్ కండ్రిగా అనే గ్రామానికి చెందిన శివయ్య పద్మావతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయింది…. వీరిద్దరు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు… కొన్నిరోజుల తర్వాత భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది…

దీంతో అప్పటికే ఓ సారి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య… కుటుంబ పెద్దలు నచ్చ జెప్పి అమెను భర్త దగ్గర వదిలి వెళ్లారు.. భార్య ఇంటికి వచ్చినా కూడా శివయ్యకు అనుమానం తగ్గలేదు… దీంతో మళ్లీ గొడవపడ్డారు… తాను ఉండలేనని తన పుట్టింటికి వెళ్లిపోతానని ఇంటినుంచి బయల్దేరింది పద్మా… దీంతో కొపంతో ఊగిపోయిన భర్త విచక్షణా రహితంగా కత్తితో రెండు చేతులను నరికి వేశాడు…