పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది స్వాతి… కాని ఆమె ఇంజనీరింగ్ చదివే సమయంలో ఫస్ట్ ఇయర్ లోనే ప్రకాష్ ని ప్రేమించింది. అతను కూడా ఆమెని ప్రేమించాడు.. కాని ఆమె తండ్రి ధనవంతుడు ఆ అబ్బాయి తండ్రి గుమస్తా.. అసలు నీ నెల ఖర్చు వాడి నాలుగు సంవత్సరాల సంపాదన అని తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు.. మార్కెట్లో పరువు పోతుంది వెళితే నేను మీ అమ్మ చస్తాము అని బెదిరించాడు. ఇక ఆమె అతన్ని మర్చిపోయింది.
అయితే ఈ నాలుగేళ్ల ప్రేమలో ఎన్నో గిఫ్టులు ఇచ్చి పుచ్చుకున్నారు.. అవన్నీ కూడా ఆమె పదిలంగా దాచుకుంది …అయితే తండ్రి వేరే వ్యక్తిని ఇచ్చి ఆమెకి వివాహం చేశాడు.. ఇక ఆమె అత్త ఇంటికి వెళ్లిన తర్వాత అంతా బాగానే ఉంది.. అయితే అనుకోకుండా ఓ వాలెంటైన్స్ డే రోజున తన ప్రియుడు గుర్తు వచ్చి అతను రాసిన లెటర్స్ గిఫ్టులు చూసుకుంది.
ఇవన్నీ చూసి తన రాక్ లో పెట్టుకుంది.. అయితే అనుకోకుండా వాటిని భర్త చూశాడు.. ఇక అక్కడ నుంచి ఆమెని అనుమానించాడు.. చివరకు ఆమెని పుట్టింటికి పంపాడు.. ఇలా నాలుగు సంవత్సరాలు అయింది.. అతను మాత్రం రాలేదు..
చేసిన చిన్న తప్పకు నా జీవితం ఎటు కాకుండా అయింది అని ఆమె తన బాధని 2016 లో ఓ మ్యాగజైన్ కు రాసింది.