ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపుతారా? తలసాని సంచలన వ్యాఖ్యలు

Will AP and Telangana be reunited? Talasani sensational comments

0
83

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పార్లమెంటులో ఏపీ,తెలంగాణ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. అయితే దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైఖరి చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ కలుపుతారో ఏమో అని అనుమానం వస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఇన్ని సంవత్సరాల నుంచి మోడీ… గుడ్డి గుర్రాల పండ్లు తోమారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలని… వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని… లేదంటే దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్‌ ఇచ్చారు.