కరోనా వైరస్ కారణంగా మార్చి నెల చివరి నుంచి స్కూళ్లు మూసివేశారు, దాదాపు 9 నెలలు అవుతోంది.. ఈ అకడమిక్ ఇయర్ అప్పుడే ఆరు నెలలు పూర్తి అయింది.. ఇంకా స్కూళ్లు తెరచుకోలేదు.. ఇంకా కరోనా భయాలు ఉన్నాయి ..ఈ సమయంలో స్కూళ్లు తెరిచినా పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్లకి పంపుతారు అనే గ్యారెంటీ లేదు.. చాలా మంది వచ్చే ఏడాది చేర్చుతాము అని చెబుతున్నారు.
అయితే ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకటి నుంచి 5 తరగతులకు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది. ప్రైవేటు స్కూళ్లను కూడా ఇందుకు అనుమతించరాదని యోచిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు, త్వరలో వెల్లడించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక స్కూళ్లు స్టార్ట్ చేస్తే భౌతిక దూరం కష్టం ఈ సమయంలో ఈ కరోనా ఇంటిలో ఉన్న మిగిలిన సభ్యులకు సోకే ప్రమాదం ఉంది.. అందుకే ఆలోచన చేస్తున్నారు.ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే కాదు ఇటు ప్రైవేటు స్కూళ్లలో కూడా లక్షల మంది ఉన్నారు, సో అందరిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని అధికారులు భావిస్తున్నారట.