ఈ కరోనా వైరస్ తో దేశంలో ఎవ్వరూ అడుగు బయటపెట్టడానికి లేదు… ప్రజలు అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఈ సమయంలో మద్యం లేక మందుబాబులు బతకలేకపోతున్నారు, చుక్క లేకపోవడంతో వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.
నిత్యం 200 నుంచి 300 కేసులు అయినా ఇలా వస్తున్నాయి, కొందరు ఆత్మహత్య సైతం చేసుకున్నారు.
ఇక లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకూ మద్యం దొరికే ఛాన్స్ లేదు , కాని దేశంలో ఇంత విపత్కర సమయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మద్యం హోమ్‌డెలివరీ చేసేందుకు వ్యాపారులను అనుమతించింది.
షాపులు తెరవకూడదు అలాగే షాపుల్లో మద్యం అమ్మకూడదు అని చెప్పింది, మద్యం హోమ్‌డెలివరీ చేసేందుకు అనుమతిచ్చామని తెలిపింది. ఇందుకుగానూ వ్యాపారులు తమ ప్రాంతంలోని పోలీసులు ఎక్సైజ్ అధికారుల నుంచి పర్మిషన్ లెటర్లు తీసుకోవాలి.
ప్రతి షాపుకీ కేవలం మూడు పాస్‌లు మాత్రమే మంజూరు చేస్తామని తెలిపింది….మద్యంప్రియులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఫోన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవాలని, ఆ తర్వాత 2 నుంచి 5 గంటల వరకూ డెలివరీ చేస్తారట దీంతో మందుబాబులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.