కేంద్రం తాజాగా లాక్ డౌన్ మరో 14 రోజులు పొడిగించింది, అంటే మే 17 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది, అయితే ప్రస్తుతం ఉన్న ఆంక్షలు అన్నీ అమలు అవుతాయి, ఎక్కడా ఎలాంటి సడలింపులు రెడ్ జోన్లలో ఉండవు, కేంద్రం తాజాగా గ్రీన్ జోన్లకు పలు మార్గదర్శకాలు ఇచ్చింది, ఇక గ్రీన్ జోన్లలో మాత్రం బస్సులు నడపవచ్చు.
అంతేకాదు రాష్ట్రాలు దాటి ఎక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు, విమానాలు బస్సులు రైళ్లు ప్రయాణాలు అనుమతించరు..అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం గ్రీన్ జోన్లకు మాత్రమే రెడ్ ఆరెంజ్ కంటైన్మెంట్లలో మాత్రం అస్సలు పాన్ మద్యం షాపులు తీయడానికి కుదరదు.