తెలంగాణలో బోయిన్ పల్లికి చెందిన ప్రవీణ్ రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసు రెండు తెలుగు స్టేట్స్ లో సంచలనం అయింది, ముఖ్యంగా ఈకేసులో తెలుగుదేశం నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయ్యారు.
- Advertisement -
అఖిలప్రియ ఏ1గా ఉన్నారు, అయితే ఆమె ఈ కేసులో ఎలా చిక్కారు అంటే ..ఈ కిడ్నాప్ చేసే ముందు పట్టుబడిన నిందితులు ఆరు సిమ్ కార్డులను తమ ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలు ఇచ్చి కొనుగోలు చేశారు.
ఇక కిడ్నాపర్లు వారిని వదిలిన సమయంలో నార్త్ జోన్ డీసీపీకి అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేశారు. ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని కలిపి మాట్లాడించారు…ఇక ఆ ఫోన్ నుంచి కిడ్నాపర్లు ముందు అఖిల ప్రియతో మాట్లాడారు, ఇది పోలీసులకి క్లూ అయింది.