‘మహిళా బందు కాదు..మహిళా రాబందు ప్రభుత్వం’

'Women are not bound..Women vulture government'

0
95

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి మండిపడ్డారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ..మూడు రోజులు తెలంగాణలో తమాషా కార్యక్రమం జరగబోతోందని, టిఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మహిళలు బతుకుతున్నారనే విధంగా టిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి కూడా టిఆర్ఎస్ ను పొగడడం ఆశ్చర్యం వేసిందన్నారు.

ఎంపీ మాలోతు కవిత ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయిందా..కాంగ్రెస్ బిక్ష వల్లే కవిత రాజకీయాల్లో ఉంది. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినట్లు టిఆర్ఎస్ వచ్చిన తర్వాతే పిల్లలు పుడుతున్నట్లు టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ఇంట్లోంచి పెన్షన్లు ఇస్తున్నారా..ఎందుకు రాఖీ కట్టాలి. టిఆర్ఎస్ మధ్యం పాలసీ వల్ల.. ఎంతో మంది ఆడబిడ్డల తాళి బొట్లు తెగాయి. ఖమ్మంలో 6 నెలల బాలికపై నాన్ బెయిల్ కేసు పెట్టిన విషయం టిఆర్ఎస్ నేతలు మర్చిపోయారా అంటూ ఫైర్ అయ్యారు.

గిరిజన మహిళా రైతులను చెట్లకు కట్టేసి కొట్టిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీదని, మహిళా బందు కాదు.. మహిళా రాబందు ప్రభుత్వం టిఆర్ఎస్ అంటూ ఎద్దేవా చేశారు. నామినేటెడ్ పోస్ట్ లలో ఎంతమంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. టిఆర్ఎస్ సంబరాలను బైకాట్ చేయాలని రవళి డిమాండ్ చేశారు.