వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసేవారు ప్ర‌తీ ఒక్క‌రు ఇది తెలుసుకోండి

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసేవారు ప్ర‌తీ ఒక్క‌రు ఇది తెలుసుకోండి

0
98

ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది.. మ‌రో 15 రోజులు పొడిగించినా ఆశ్చ‌ర్యం లేదు, అయితే ఈ నెల రోజులు క‌చ్చితంగా అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు, అయితే ఇప్పుడు చాలా మంది సాఫ్ట్ వేర్ ఫైనాన్స్ రంగాల‌కు చెందిన వారు ఇంటి నుంచి కంపెనీ ప‌నులు చేస్తున్నారు.

అంతా ఆన్ లైన్ వ‌ర్క్ గ్రూప్ కాల్ చాటింగ్ తోనే ప‌ని ముగిస్తున్నారు, కాస్త లేట్ అవుతున్నా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ నుంచి ప‌ని చాలా వ‌ర‌కూ కంపెనీలు పూర్తి చేస్తున్నాయి. ఒత్తిడి, వర్క్ టార్గెట్‌తో ఎక్కువ సేపు కూర్చోవాల్సిన పరిస్థితి.

దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్‌, వెన్నునొప్పి వంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే క‌చ్చితంగా ఓ అర‌గంట‌కు ఓసారి లేచి నిల‌బ‌డాలి కాస్త 5 మినిట్స్ అయినా వాకింగ్ చేయండి తిరుగుతూ అంటున్నారు వైద్యులు.

ఇలా కూర్చుంటే శరీరంలోని లైపోప్రోటీన్‌ లైపేజ్‌ అనే ఎంజైమ్‌ పనితీరు మందగిస్తుంది. ఈ ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్‌ను పీల్చుకుంటుంది. కొవ్వు కూడా పెరుకుపోతుంది సో జాగ్ర‌త్త అని చెబుతున్నారు వైద్యులు.