ప్రపంచంలోనే అత్యంత దారుణం అన్నీ దేశాలు జాలి చూపులు

ప్రపంచంలోనే అత్యంత దారుణం అన్నీ దేశాలు జాలి చూపులు

0
86

ముందు మాకు ఏ సహకారం వద్దు అని ఆ కార్చిచ్చు చల్లార్చుతాం అని అనుకున్న అక్కడ ఆస్ట్ర్రేలియా ప్రధాని ఇప్పుడు ఇతర దేశాల సాయం కోరారు, అందరూ కలిసి ఆ మంటలను ఆపకపోతే ఇతర దేశాలకు కూడా ఆ గాలి వాటంతో మంటలు అంటుకునే ప్రమాదం ఉంది అని తేల్చారు పర్యావరణ నిపుణులు.అప్పుడు వద్దు అని ఇప్పుడు వేరేదేశాల సాయం తీసుకుంటున్నాడు ఆ ప్రధాని, మన మూడు జిల్లాల ప్రాంతం ఎంత ఉంటుందో అంత అటవీ ప్రాంతం బూడిద అయిపోయింది… ఆస్ట్రేలియాలో చాలా వరకూ ఆకాశం ఆ మంటలకు ఎరుపు రంగులో మారిపోయింది.

అక్కడ ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.. 120 ప్రధాన పట్టణాలు మబ్బుగా మారిపోయింది, దుమ్ము దూళితో నిండిపోయింది..తీవ్ర జబ్బుల బారిన పడుతున్నారు జనం, ఇప్పటికే 50 లక్షల మాస్కులు తయారు చేసి ఇచ్చింది ఆస్ట్ర్రేలియా , ఇంకా నాలుగు నెలలు మంటలు ఆర్పటానికి సమయం పడుతుంది.

అక్కడ మంటలు 70 మీటర్ల ఎత్తు లేస్తున్నాయి.. అందుకే వాటిని ఆపలేకపోతున్నారు, చనిపోయిన వాటిలో కంగారులు,గబ్బిలాలు కూడా ఉన్నాయి.. కొయిలాలు అనే జీవులు నడిచే వెళతాయి, దీంతో నెమ్మదిగా నడవడంతో అవి మంటల్లో చిక్కుకుని చనిపోతున్నాయి. అందుకే వీటిని చాలా మంది కాపాడుతున్నారు..అమెజాన్ లో గతంలో 7 లక్షల హెక్టార్లు కాలిపోయాయి, తర్వాత కాలిఫోర్నియాలో ఇలాగే అడవులు తగలపడ్డాయి.. అందుకే జాగ్రత్తలు చెబుతున్నారు అన్నీ దేశాలకు , ఇప్పుడు ఆస్ట్ర్రేలియాలో సగటు ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతోంది. ఇదే అక్కడ ఎండ రికార్డు
24 గంటలూ వేల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు .. సిడ్నీలో నాలుగు రోజులుగా చాలా చోట్ల కరెంట్ లేదు, ఎమెర్జెన్సీ సేవలు కూడా నిలిపివేశారు, ఈ దారుణం మరెవరికి రాకుడదు అంటున్నారు ఆ దేశ ప్రజలు.