ప్రపంచ నెంబర్ 1 సంపన్నుడిగా ఫ్రాన్స్ వ్యాపారవేత్త – బెజోస్ సెకండ్ ప్లేస్

రియల్ టైమ్ బిల్లియనీర్స్ జాబితా

0
89

ఈ కరోనా ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ని కూడా వెనక్కి నెట్టింది.
ఈ కరోనా కారణంగా చాలా మంది వ్యాపారాలు డౌన్ అయ్యాయి. అయితే ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న బెజోస్ ఇప్పుడు తన ప్లేస్ కోల్పోయారు. ఆయన సంపాదన తగ్గింది.

ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిల్లియనీర్స్ జాబితాలో ప్రపంచ నెంబర్.1 సంపన్నుడిగా ఫ్రాన్స్ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. LVMH Moët Hennessy Louis Vuitton. ఈ కంపెనీ చాలా మందికి తెలిసిందే.
ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్ అలాగే 70 బ్రాండ్స్ కు బెర్నార్డ్ ఆర్నాల్డ్ అధిపతి.
ఆయన వయసు 72 సంవత్సరాలు ఇక మొత్తం ఆయన ఆస్తుల విలువ 198.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

2019, జనవరి 2020, మే 2021 లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆయన నిలిచారు, ఇప్పుడు మళ్లీ ఆయన ఫస్ట్ ప్లేస్ కి చేరుకున్నారు.ఆర్నాల్ట్కు ఐదుగురు సంతానం ఇక నలుగురు ఆయన వ్యాపారం చూసుకుంటున్నారు. ఇక ఆయన తర్వాత బెజోస్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 194.9 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు.