ఇప్పటి జనరేషన్ లో 50 నుంచి 60 ఏళ్లు జీవించడం బతకడం అంటే కష్టం… 30 కే సర్వరోగాలు వస్తున్నాయి అని భయపడే స్దితి.. అయితే గతంలో అంటే మన తాతల కాలం తిండి వేరు వాతావరణం వేరు, ఎంత సైన్స్ మెడిసన్ అభివృద్ది చెందినా, బతికే వయసు మాత్రం తగ్గుతోంది, ఇప్పటికీ నాటి తరం వారు చెక్కు చెదరకుండా ఉన్నారు.
అయితే ఇలాంటి ఓ వయో వృద్దుడు ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కువ కాలం బతికిన వ్యక్తి నేడు మరణించారు… అదే విషాదం నింపింది. ప్రపంచ వయో వృద్ధుడు బాబ్ వెయిటన్ కన్నుమూశారు, ఆయన వయసు 112 ఏళ్లు.
గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న బాబ్ గురువారం తుది శ్వాస విడిచారు. 1908 మార్చి 29న బ్రిటన్ ఈస్ట్ యార్క్షైర్లోని హుల్లో బాబ్ వెయిటన్ జన్మించారు, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, ఉపాధి నిమిత్తం, తైవాన్, జపాన్, కెనడాలో ఆయన ఇంజనీర్గా పనిచేశారు.26 మంది బ్రిటన్ ప్రధానుల పరిపాలనను బాబ్ చూశారు.ఈయనే ప్రపంచంలోని అత్యంత వయో వృద్దుడిగా ఉన్నారు.