ప్ర‌పంచాన్ని విషాదంలో నెట్టేసిన గ్యాస్ ఘ‌ట‌న‌లు ఇవే

ప్ర‌పంచాన్ని విషాదంలో నెట్టేసిన గ్యాస్ ఘ‌ట‌న‌లు ఇవే

0
98

విశాఖ‌లో ఈ విష‌వాయువు లీకైన ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 12 మంది మ‌ర‌ణించారు, అయితే ఇలాంటి ప్ర‌మాదాలు చాలా చోట్ల జ‌రిగాయి, మ‌న దేశంలో భోపాల్ ఘ‌ట‌న అత్యంత దారుణ‌మైన ఘ‌ట‌న‌గా చెబుతారు, అయితే వ‌ర‌ల్డ్ వైడ్ జరిగిన ఇలాంటి ప్ర‌మాదాలు కొన్ని ఇప్పుడు చూద్దాం.

టెక్సాస్ స్కూల్ సమీపంలో ఉన్న నేచురల్ గ్యాస్ పేలుడు వల్ల సుమారు 300 మంది విద్యార్థులు చనిపోయారు. ఇది 1937లో జ‌రిగింది, అత్యంత విషాద‌క‌రం.

భోపాల్ పారిశ్రామిక వాడలో భోపాల్ గ్యాస్ విషాదం ఈ ప్రమాదం జరిగింది.. 1984 లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
సుమారు 40 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ కావడం వల్ల సుమారు నాలుగు వేల మంది చనిపోయారు. 5 ల‌క్ష‌ల మందిపై ఇది ప్ర‌భావం చూపించింది.

పైపర్ ఆల్ఫా డిజాస్టర్‌(1988) ఆయిల్ రిగ్‌లో జరిగింది ప్ర‌మాదం 167 మంది మ‌ర‌ణించారు.

ఉఫా ట్రైన్ డిజాస్టర్‌ (1989): సోవియేట్ రష్యాలో జరిగిన రైలు ప్రమాదం ఇది. రైల్వే లైన్ ద‌గ్గ‌ర జ‌రిగిన ప్ర‌మాదంలో సుమారు 575 మంది మ‌ర‌ణించారు.

గుడాలజరా గ్యాస్ బ్లాస్ట్‌(1992): మెక్సికోలోని గుడాలజరా నగరంలో పెట్రోల్ .. సీవేజ్‌లోకి లీక్ కావడం వల్ల 12 చోట్లు పేలుళ్లు జరిగాయి. ఈ ఘ‌ట‌న‌లో 200మంది మ‌ర‌ణించారు.

బీజింగ్ లో గంగ్లూ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో గ్యాస్ లీకై 2008లో 17 మంది చ‌నిపోయారు

చైనా గనిలో గ్యాస్ లీక్‌(నవంబర్‌, 2011) న‌ 20 మంది కార్మికులు మృతిచెందారు

కావోషింగ్ గ్యాస్ పేలుడు(2014): తైవాన్‌లోని కావోషింగ్ సిటీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 25 మంది మ‌ర‌ణించారు.