పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా?..రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Would this happen if there was a PJR? .. Rewanth Reddy Ghat comments

0
74

తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలోని బసవతారక నగర్ వడ్డెర కాలనీ సందర్శించారు. అక్కడ వడ్డెరల ఇళ్లు కూల్చిన అంశంలో బాధితులకు దైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..క్రిస్మస్ పండగ రోజున పేదల కళ్ళలో నీళ్ళు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బసవతారక నగర్ లో పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయిన వారు ఇప్పుడు మరిచారు.

మొన్న బుధవారం తల్లిదండ్రులు పనులకు పోయినప్పుడు..పిల్లలు బడులకు పోయినప్పుడు వచ్చి ఇక్కడ గుడిసెలు కూల్చారు. ఇక్కడ ఉన్న వడ్డెర సోదరులు తమ కండలు కరగదిస్తేనే ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు వచ్చాయి. ప్రభుత్వం కక్ష సాధింపుతో వీరిని అనాధాలుగా చేసింది. కూల్చిన వెంటనే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న. 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న వారిని వారు కోరుకుంటున్న విధంగా 60 గజాల భూమి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి పట్టాలివ్వకుంటే..పట్టాలు వచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే వీరందరికీ వంటా వార్పు చేస్తాం. కూల్చిన ఇళ్లల్లోనే ఆడబిడ్డ ప్రసవం జరిగింది. తక్షణమే మున్సిపల్ మంత్రి ఇక్కడికి రావాలి. స్థానికంగా ఉన్న 250 కుటుంబాలు 1000 మంది బాధ్యత మున్సిపల్ మంత్రి కేటీఆర్ దే అని అన్నారు.

తక్షణమే వారు ఇక్కడికి వచ్చి పట్టాలు ఇవ్వాలి. మా పార్టీ వీరికి అండగా ఉంటుంది. అధికారులతో ,మున్సిపల్, జోనల్ కమిషనర్ లతో మాట్లాడిన..కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడి పట్టాలు ఇవ్వడానికి చొరవ తీసుకుంటా. పీజేఆర్ (పి.జనార్థన్ రెడ్డి) ఉంటే ఇలా జరిగేదా. పీజేఆర్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఉండాలి. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో పీజేఆర్ లేని లోటు కనిపిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.