వుహ‌న్ లో మ‌రో డేంజర్ మ‌ళ్లీ చైనాకి క‌ష్టాలేనా

వుహ‌న్ లో మ‌రో డేంజర్ మ‌ళ్లీ చైనాకి క‌ష్టాలేనా

0
85

వుహ‌న్ న‌గ‌రం ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటోంది.. సాధార‌ణ‌ప‌రిస్దితికి చేరుకుంటోంది. బైకులు కార్లు అన్నీ కాస్త బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి, అయితే మ‌ళ్లీ ఇక్క‌డ వైర‌స్ పంజా విసిరింది…ఇంకా ఎవ‌రికైనా వైర‌స్ ఉందా అనే అనుమానం చాలా మందికి వ‌స్తోంది.

ఈ స‌మ‌యంలో తాజాగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు ఎక్కువ రావ‌ద్దు అని కొంద‌రు మాత్ర‌మే రావాలి అని అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు, నిత్య అవ‌స‌ర వ‌స్తువుల‌కి చిన్న ప‌నులు చేసుకునే వారు ఉద్యోగులు మాత్ర‌మే రావాలి అని తెలిపారు.

గురువారం కొత్తగా 51 కేసులను గుర్తించిన నేపథ్యంలో అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏప్రిల్ 8 నుంచి 100 ప్యాసింజర్ రైళ్లను నడపాలని అధికారులు ప్లాన్ చేస్తున్న స‌మ‌యంలో ఇప్పుడు ఇది ఆపుతున్నారు.కరోనా వైరస్ కారణంగా తొమ్మిది వారాలపాటు లాక్‌డౌన్‌లో ఉన్న వూహాన్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి కాని మ‌ళ్లీ కొత్త‌గా కేసులు రావ‌డంతో షాక్ అవుతున్నారు జ‌నం.