యాదాద్రి చేరుకున్న‌ సీఎం కేసీఆర్

Yadadri reached CM KCR

0
79

యాదాద్రి పుణ్య‌క్షేత్రానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్ యాదాద్రికి వెళ్లారు. మ‌రికాసేప‌ట్లో యాదాద్రిలో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకోనున్నారు. పూర్తి కావస్తున్న పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు మీడియాకు సీఎం తెలియజేయనున్నారు.