యనమల కోరికి నెరవేరుతుందా…

యనమల కోరికి నెరవేరుతుందా...

0
199

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు…. గతంలో న్యాయవాదిగా ఉన్న ఆయన్ను రాజకీయాల్లోకి తెచ్చి మంత్రిని చేడమే కాదు.. అనేక కీలకమైన పదవులు ఇచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావుది… ఇక యనమల ఆదినుంచి చంద్రబాబు నాయుడు రూట్లో గూట్లో ఉంటూ వచ్చారు… దీంతో ఆయనరోశయ్యతర్వాత ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన అర్థిక మంత్రిగా పేరు తెచ్చుకున్నారు..

అంతేకాదు శాసన సభ స్పీకర్ తోపాటు శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు వహించారు… టీడీపీలో పొలిటి బ్యూరో మెంబర్ గా సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ వస్తున్న యనమలకు చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… రాజ్యసభ మెంబర్ గా ఉండాలన్నది తన కోరిక అని యనమల చెప్పుకొచ్చారు… నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల పెద్దలసభమీద కన్నేశారు..

ఆయనకు అప్పటికే తుని నియోజకవర్గంలో పట్టు ఉంది… అక్కడ వైసీపీ నుంచి దాడిసెట్టి రాజా గెలిచారు.. దీంతో యనమల ఇక ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజ్యసభకు పోదామనుకున్నారు.. అయితే చంద్రబాబు ఆయన్ని అర్ధిక మంత్రిగా చేసి ఎమ్మెల్సీగా పంపించారు… అలా యనమల అనుభవాన్ని చంద్రబాబు వాడుకున్నారు… కానీ యనమల కోరిక మాత్రం తీరలేదు…

2018 ఎన్నికల్లో చివరి ఛాన్స్ గా ఆయన రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు… కానీ చంద్రబాబు ఆయనకు మళ్లీ టికెట్ ఇవ్వలేదు… దీంతో యనమల శాసన మండలి మెంబర్ గానే ఉండిపోయారు… ప్రస్తుతం టీడీపీ అధికారం కోల్పోయింది… 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే యనమల కోరిక నెరవేరుతుందని లేదంటే ఆయన కోనిక కోరిగానే ఉండిపోతుందని అంటున్నారు..