ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటన చేశారు… జగన్ ప్రకటనకు కొంతమంది స్వాగతిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకేస్తున్నారు…
ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మూడు రాజధానులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు… తాజాగా శ్రీ వారిని దర్శించుకున్న బుగ్గన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ…. 13 జిల్లాల సమగ్రాభివృద్ది సీఎం లక్ష్యం అని అన్నారు…
ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు… అన్ని ప్రాంతాల అనుగునంగా అభివృద్ది వికేంద్రీకరణ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు…. జగన్ ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చు అని మాత్రమే చెప్పారని అది ఆలోచన మాత్రమే అని అన్నారు… రాజధానిపై కమిటీ వేశామని ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు క్లారిటీ వస్తుందని అన్నారు.,..