రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ

రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ

0
90

ఇటీవల కాలంలో ఏపీ అధికర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు సంచలన విషయాలు బయట పెడుతున్నారు. తాజాగా ఇదే రీతిలో బొత్స సత్యనారాయణ తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌళి గురించి సంచలన విషయాలను బయట పెట్టారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మరోసారి రాజధాని విషయంపై స్పందించారు..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దర్శకుడు రాజమౌళిని అమరావతి ఆర్కిటెక్చర్ రూపొందించే బాధ్యతలను అప్పగించడంపై ప్రస్తావించారు… రాజమౌళి చాల గొప్పవాడని కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఆయనకు తెలియదని అన్నారు. చిత్ర పరిశ్రమలో దర్శకుడు దాసర సత్యనారాయణ తర్వాత అంతపేరు తెచ్చుకుంది రాజమౌళి అని అన్నారు

ఆయనకు చిత్ర పరిశ్రమలపై అవగాహణ ఉందని అయితే ఏ జిల్లాలో ఎలా అభివృద్ది చేయాలనేది తెలియదని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో రాజమౌళి వ్యవహారం కూడా ఒకటని అన్నారు.