బద్వేలు ఉప ఎన్నికల్లో కౌంటింగ్ ముగిసింది. బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా ఘన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 90,089 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
పార్టీల వారీగా వచ్చిన ఓట్ల సంఖ్య
వైసిపి:-11,1710
బిజేపి:-21,621
కాంగ్రెస్:-6205
నోటా:-3635
వైకాపా ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. లెక్కించిన ఓట్లలో వైకాపాకు.. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ రావడంతో ఉప పోరులో వైకాపా గెలిచినట్లైంది.
వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది. అధికార పక్షం.. ఆనవాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఈ ఎన్నికలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాలని భావించినా సెంటిమెంట్, ఆనవాయితీని పాటించాలని నిర్ణయం తీసుకొంది.