కేంద్రమంత్రి పదవి.. వైసీపీకి జాక్ పాట్

కేంద్రమంత్రి పదవి.. వైసీపీకి జాక్ పాట్

0
81

రాజకీయాల్లో ఏ పార్టీ ఏ నాయకుడు ఎప్పుడు ఎలా ముందుకు వెళతారో తెలియదు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో చెప్పలేము.. అంతేకాదు పార్టీలు కూడా సొంతంగా ఉండచ్చు లేదా విలీనం అయినా చేయవచ్చు. అందుకే రాజకీయాల్లో శత్రువులు మిత్రులు కూడా ఎవరూ ఉండరు ..తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఒక ఆసకికరమైన చర్చ ప్రచారంలో ఉంది.

అవును బీజేపీకి దగ్గర అయితే వైసీపీకి ఓ కేంద్ర మంత్రి పదవి ఇస్తాము అని ఆఫర్ వచ్చిందట. అందుకే జగన్ కూడా అక్కడ రాజధాని నిధుల విషయం గురించి చర్చించి ఈ విషయం చర్చిస్తారు అని అంటున్నారు. కాగా ఇటీవలే ఎన్డీయే నుంచి శివసేన బయటకు వెళ్ళిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆస్థానాన్ని వైసీపీ నేతలతో భర్తీ చేయాలనీ కేంద్ర బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..మరి జగన్ బీజేపీకి దగ్గర అయి ఆ పదవి తీసుకుని కేంద్రంతో సయోధ్యగా వెళతారా లేదా అనేది చూడాలి.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి ఈ కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదా మిధున్ రెడ్డికి అయినా ఈ పదవి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇది వాస్తవమో కాదో చూడాలి.