వైసీపీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే…

వైసీపీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే...

0
97

కృష్ణా జిల్లా నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న వైసీపీ నేత సీనియర్ రాజకీయ నాయకుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… సీఎం జగన్ వ్యహార శైలిపై పార్టీపై ఒకింత ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు… పార్టీ కోసం ఎంతో శ్రమించిన నాయకుడిగా జగన్ దగ్గర మంచి మార్కులు ఉన్న ప్రతాప్ నూజివీడు జమిందార్ మేకా రాజారంగయ్యప్పారావు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు..

సుదీర్ఘకాలంపాటు రాజకీయాలు చేశారు… వైసీపీ పార్టీ స్ధాపించినప్పటినుంచి ఆ పార్టీలోనే కొసాగుతున్నారు ప్రతాప్ అప్పారావు… 2014,19 లో ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు… అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ అని అందరు భావించారు..

కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు… కనీసం ఆయనకు నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు…దీంతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. వైసీపీపై ఈగ కూడా వాలని మేకా ఇప్పుడు మౌనంగా ఉండటతో నియోజకవర్గంలో అందరు చర్చించుకుంటున్నారు…