ప్రకాశంలో వైసీపీకి మరో బిగ్ షాక్

ప్రకాశంలో వైసీపీకి మరో బిగ్ షాక్

0
132

తెలుగుదేశం పార్టీ బలంగా ప్రస్తుతం ఉంది అంటే అది ప్రకాశం జిల్లా అని చెప్పాలి.. ఏకంగా ఈ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ నుంచి గెలిచారు.. అందుకే అక్కడ నుంచి పార్టీలోకి నేతలు ఎవరు అయినా చేరుతారా అనేవార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా సీనియర్ నేతలు కూడా ప్రకాశం పై ఫోకస్ చేశారు.. దగ్గుబాటి ఎపిసోడ్ తర్వాత వైసీపీ నుంచిప్రకాశం జిల్లాలో ఎలాంటి వార్తలు వినిపించడం లేదు.

ప్రకాశం జిల్లాలో టీడీపీకి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి
కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు గెలిచారు.

అయితే గొట్టిపాటిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్లాన్ వేస్తోంది అని వార్తలు వస్తున్నాయి.. ఆయన మాత్రం పార్టీ మారేది లేదు అంటున్నారు.. ఈ సమయంలో జిల్లాలో గెలిచిన నలుగురు నేతలతో చంద్రబాబు ఇటీవల మాట్లాడారట.. పార్టీ మారే ఉద్దేశ్యం తమకు లేదు అని నేరుగా చంద్రబాబుకి చెప్పారట జిల్లా నలుగురు నాయకులు.