కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు ఇన్నాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేసి వారి డబ్బులను కాజేసిన వీరు ఇప్పుడు ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు.. తాజాగా అధికార వైసీపీ ఎమ్మెల్సీ జకీయా ఖానమ్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు…
తన పేరు బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు.. ఆ తర్వాత 50వేలు డిపాజిట్ చేస్తే ప్రభుత్వం 25 లక్షల రుణం ఇస్తుందని సమ్మబలికాడు… డబ్బులు వేసేందుకు తెలంగాణలోని జగ్గారెడ్డి గూడెం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను పంపించాడు…
దీంతో పాటు సీఎం కార్యాలయం పేరు చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది.. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది… పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…