వైసీపీ లేడీ ఎమ్మెల్యేపై రాళ్లతో కర్రలతో దాడి….

వైసీపీ లేడీ ఎమ్మెల్యేపై రాళ్లతో కర్రలతో దాడి....

0
75

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాది చేశారు… అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది… కోటప్పకొండ కట్టుబడివారిపాలెంకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు ఆమెపై దాడి చేశారు…

దాడి చేసిన కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నట్లు ప్రత్యర్థులు రాళ్లతో కర్రలతో కారును ద్వంసం చేశారు.. తీరా చూస్తే ఆమె కారులో లేరు.. కారులో ఎమ్మెల్యేకు బదులు మీరేందుకు ఉన్నారని అనుచరులతపై ప్రత్యర్థులు దాడి చేసినట్లు తెలుస్తోంది…

ఇంతలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది… ఈదాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది… దీనిపై రజనీ స్పందించారు… కాపు కాచి దాడి చేయడం కాదని ప్రజా క్షేత్రంలో గెలవాలని సవాల్ విసిరారు…