వైసీపీ నేత దారుణ హత్య….

వైసీపీ నేత దారుణ హత్య....

0
91

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురి అయ్యాడు… ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గుంటూరు జిల్లా క్రిస్టియన్ పాలెం పరిధిలోని హనుమాన్ నగర్ కు చెందిన గిరిజన యువకుడు బళ్లాని అబ్రహాం అలియాస్ బుజ్జికి తన దాయాదులతో గొడవలు ఉన్నాయి…

ఈ క్రమంలో తన సోదరులతో రెండు రోజుల కిందట మద్యం మత్తులో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది… ఇక ఇది మనసులో పెట్టుకుని మరుసటి రోజు అతనిపై మూకుమ్మడిగా డాడికి దిగారు దాయాదులు… అన్ని విచక్షణా రహితంగా కొట్టారు…

దీంతో అతను అపస్మారక స్థితిలో చేరుకున్నారు… వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు… అక్కడ ఆయన చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…