వైసీపీలో చేరిన విక్టరీ వెంకటేష్ సోదరి

వైసీపీలో చేరిన విక్టరీ వెంకటేష్ సోదరి

0
123

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నామినేషన్ల పర్వం సాగుతోంది… స్దానిక పోరులో చాలా మంది కొత్తవారు ఈసారి ఎన్నికల్లో దిగుతున్నారు.. తాజాగా సినిమా ఇండస్ట్ట్రీకి చెందిన ఓ దిగ్గజ హీరో సోదరి వైసీపీలో చేరారు, ఆయనే విక్టరీ వెంకటేష్, అవును విక్టరీ వెంకటేష్ సోదరి వైసీపీలో చేరి ఆమె స్ధానిక ఎన్నికల పోరులో వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు.

ఏపీ అధికార పార్టీ వైసీపీ తరఫున ఆమె జడ్పీటీసీగా బరిలోకి దిగారు. వెంకటేశ్ సోదరి తాళ్లూరు స్వరూపరాణి ప్రస్తుతం ఏపీలోని నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్ తోడబుట్టిన సోదరి కాకున్నా… కజిన్ అయిన స్వరూపరాణి… తన మెట్టినిల్లు దగదర్తి మండలంలో ఉండటంతో అక్కడే నివాసం ఉంటున్నారు.

ఆమె భర్త ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నారు, అందుకే తాజాగా ఆమె రాజకీయాల్లో వచ్చారు. ఆమె రామానాయుడు సోదరుడి కుమార్తె అని తెలుస్తోంది, స్వరూపరాణి ఎన్నికల బరిలోకి దిగడంతో రామానాయుడు కుటుంబం కూడా రాజకీయాల్లోకి వచ్చారు అని అంటున్నారు.