వైసీపీలో గోకరాజు గంగరాజు ఎందుకు చేరలేదంటే

వైసీపీలో గోకరాజు గంగరాజు ఎందుకు చేరలేదంటే

0
109

వైసీపీలోకి మాజీ ఎంపీ గోకరాజు గంగారాజు ఆయన కుటుంబం చేరుతారు అంటూ వార్తలు వినిపించాయి.. మొత్తానికి బీజేపీకి పెద్ద షాక్ అని వార్తలు వైరల్ అయ్యాయి.. చివరకు గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు మాత్రమే వైసీపీలో చేరారు.. అంతకుముందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు దీనిపై క్లారిటీ ఇచ్చారు .తాను వైసీపీలో చేరడం లేదని చెప్పారు

తన కుమారుడు నా సోదరులు వైసీపీలో చేరుతున్నారు అని చెప్పారు.. వైయస్ కుటుంబం ముందు నుంచి మాకు సన్నిహితులు, పైగా నా కుమారుడు జగన్ మిత్రులు అని చెప్పారు ఆయన. అందుకే వారు రాజకీయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు, తాను బీజేపీలోనే ఉంటాను అన్నారు.

గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు , అలాగే గంగరాజు సోదరులు రామరాజు, నరసింహరాజు కూడా వైసీపీ కండువాలు కప్పుకున్నారు. వైఎస్సార్ అంటే తమకు అమితమైన అభిమానమని ఆయన సోదరులు తెలియచేశారు.