వైసీపీలో మొదలైన వార్

వైసీపీలో మొదలైన వార్

0
95

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు… సొంతపార్టీ అనుచరులపై అనుసరిస్తున్న విధానాలపై ఆపార్టీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు… పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తి అయినప్పటికీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరుగలేదు…

కేవలం ఫోటోలు వీడీయోల హడావుడి తప్ప ఈ నియోజకవర్గంలో అభివృద్ది నోచుకోలేదని ప్రజలు బహిరంగంగానే అంటున్నారు… ఇక టీడీపీ సంగతి సరేసరీ…శ్రీదేవి ఎస్సీ కాదని క్రిస్టియన్ అని అంటున్నారు… ఇక ఈ వివాదం తెరపైకి రావడంతో రాష్ట్రపతి నుంచి ఏపీ సీఎస్ కు విచారణ ఆదేశాలు కూడా వచ్చాయి…

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లుడుతూ తాను క్రిస్టియన్ అని పేర్కొంది.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై టీడీపీ నాయకులు స్పందించారు… శ్రీదేవి ఎస్సీ కాదని క్రిస్టియన్ కులాని చెందిన ఆమె ఎన్నికల షెడ్యూల్ లో తప్పుడు దృవ పత్రాలను సమర్పించదని రాష్ట్రపతి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ కు ఫిర్యాదు చేశారు… దీంతో విచారణకు ఆదేశించారు.. ఒకే వేళ శ్రీదేవి క్రిస్టియన్ అని తెలితే పదవి నుంచి కోల్పోయో పరిస్థితి కూడా రావచ్చే…

రాష్ట్రపతికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఫిర్యాదు చేసింది. దీంతో అక్టోబర్ 16 వ తేదీన ఏపీ చీఫ్ సెక్రటరీ కి ఈ విషయం పై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీచేశారు రాష్ట్రపతి. దీనికితోడు ఆమెను కులంపేరుతో దూషించారని అట్రాసిటీ కేసులు ఎదుర్కొంటున్న పెదపరిమి, అనంతవరారనికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆమె ప్రోద్బలంతో పెట్టిన అట్రాసిటీ కేసులు చెల్లవంటూ న్యాయపోరాటానికి సిద్ధం అయ్యారు. ఒక వేళ ఆమె క్రిస్టియన్ అని తేలితే పదవి కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు.

’’’’’’’’’’’’’’’’’