తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… వైసీపీలో చేరి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట…
ఒక వేల ఆయన వైసీపీలో చేరితే పార్టీతరపున రాజ్యసభ సీటు ఇవ్వనున్నారని టాక్… వచ్చే ఎప్రిల్ నెలలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి ఈ నాలుగు వైసీపీకే దక్కనున్నాయి.. అయితే అందులో ఒకటి చిరంజీవికి ఇవ్వాలని చూస్తున్నారట…
చిరంజీవి కూడా జగన్ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నారని అయితే తన నిర్ణయం ప్రకటించకున్నారని వార్తలు వస్తున్నాయి… చిరుకు మంత్రి కన్నబాబు సన్నిహితుడూ… ఆయన ద్వారా రాయభారాలు నడుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…
కాగా చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ స్ధాపించి దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు…