వైసీపీకి మూడు జిల్లాల్లో దారుణమైన ఫలితాలు

వైసీపీకి మూడు జిల్లాల్లో దారుణమైన ఫలితాలు

0
89

అవును గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి ..అలాగే ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు నాయకులు. కాని ఇప్పుడు వైసీపీ గట్టి నాయకులను రంగంలోకి దింపాం టీడీపీ నేతలు ఓడిపోతున్నారు అంటూ చెప్పింది. అలాగే ప్రచారం కూడా చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ చాలా ధీమాగా ఉంది. ఎలాంటి సర్వేలు వైసీపీ చెప్పినా వారు పట్టించుకోవడం లేదు, గత ఎన్నికల్లో కూడా ఇలానే అన్నారు, కాని రివర్స్ అయింది వైసీపీకి ఓటమి వచ్చింది అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు…

తాజాగా ఇప్పుడు కూడా అదే విషయం చెబుతున్నారు,. ఇప్పుడు వైసీపీకి ఇక్కడ భారీగా ఉత్తరాంధ్రాలో మూడు జిల్లాలో దారుణమైన ఓటమి తప్పదు అని తమ సర్వేల్లో తేలింది అని చెబుతున్నారు. మరి ఇంతకీ ఏ సర్వేలు, వారు ఎవరు అనేది ఫలితాలలో తెలుస్తుంది అని చెబుతున్నారు. అయితే వైసీపీ సర్వేలు ఏమాత్రం సక్సెస్ కావు అని చెబుతున్నారు టీడీపీ నేతలు.