వైసీపీ మంత్రి కుమారుడికి బెంజ్ కారు…. విచారణ జరిపించండి…

వైసీపీ మంత్రి కుమారుడికి బెంజ్ కారు.... విచారణ జరిపించండి...

0
91

ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. సమావేశం మధ్యలోనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి మంత్రి గుమ్మనురు జయరాం అలాగే ఆయన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ లపై ఫిర్యాదు చేశారు…

ఈ ఎస్ఐ కుంభకోణంలో భాగంగా గుమ్మనూరు ఈశ్వర్ కు బెంజ్ కారు లంచంగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు…ఈఎస్ఐ స్కాంలో ఏ14 ముద్దాయిగా ఉన్న తెలకపల్లి కార్తిక్ అనే వ్యక్తి మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ కు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారని తెలిపారు… ఈ కారును బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు…

ఏ14 ముద్దాయికీ ఈశ్వర్ కు ఏంటి సంబంధం అని ఆరోపించారు… ఈ వ్యవహారంపై సర్కార్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. ఎలాంటి ఆధారాలు లేకపోయినా టీడీపీ నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారని మండిపడ్డారు…