వైసీపీ మంత్రులు ఫుల్ హ్యాపీ…

వైసీపీ మంత్రులు ఫుల్ హ్యాపీ...

0
89

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కొంత ఊపిరి పీల్చుకున్నట్లే అనిపిస్తోంది… పైకి గంభీరంగా ప్రకటనలు చేయకున్నప్పటికీ లోలోపల స్థానిక సంస్ధల ఎన్నికల వాయిదా పడటంతో వారు ఆనందపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఎన్నికల్లో ఒకవేళ ఓటమి ఎదురైతే ఆ తప్పిదం నిమ్మగడ్డ పైకి నెట్టేందుకు సిద్దమవుతున్నారట…

స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే… కరోనా కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం… నిజానికి ఎన్నికల వాయిదా పడిన తర్వాత రోజా వంటి వారు సమర్థించారు…. తర్వాత నాయత్వం లైన్ తెలిపి నాలుక కరుచుకున్నారు…

అయితే ఇప్పుడు మంత్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు… స్థానిక సంస్ధల ఎన్నికల్లో గెలుపోటములను బట్టే మంత్రి పదవులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు కూడా హెచ్చరించారట… దీన్ని బట్టి జగన్ స్థానికి సంస్థల ఎన్నికల విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో చెప్పకనే తెలుస్తోంది..