చదువు పూర్తి కాగానే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించారు… ఆ వెంటనే జగన్ చొరవతో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు… ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఛాన్స్ కొట్టేశారు.
అయితే గతం మర్చి పోకుండా మళ్లీ టీచర్ గా మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు ఆలేడీ మంత్రి. ఇంతకుఆమె ఎవరనుకుంటున్నారా. ఎవరోకాదు పుష్పశ్రీవాణి ప్రకృతి కోసం తీస్తున్న ఓ సినిమాలో టీచర్ గా నటించేందుకు అంగీకరించారు ఉప ముఖ్యమంత్రి…
నిర్వాహకులు అడిగిన వెంటనే గతంలో తాను పనిచేసిన టీచర్ గా నటించడం ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి. నేటీ రోజుల్లో వ్యవసాయం చేస్తున్న రైతుకు అవగాహణ కల్పించేందుకు తీస్తున్న ఓ సినిమాలో నటించేందుకు సిద్దమయ్యారు మంత్రిగారు…